హీరో సినీ కెరీర్ లో ఫ్లాపులు ఉండడం సహజం.అయితే  కొన్ని సందర్భాల్లో ఆ ఫ్లాపులు హీరోల కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపితే మరికొన్ని సందర్భాల్లో ఆ ఫ్లాపులు నిర్మాతలపై ఊహించని స్థాయిలో ప్రభావం చూపుతాయి.ఇకపోతే ఒక్క ఫ్లాప్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు.కాగా టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ తన సినిమాలలో మెజారిటీ సినిమాలకు తనే నిర్మాతగా వ్యవహరించారు.అయితే ఈ ప్రయాణంలో కొన్నిసార్లు కళ్యాణ్ రామ్ కు పాజిటివ్ ఫలితాలు ఎదురైతే మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఫ్లాపులు పలకరించాయి.

ఇక కళ్యాణ్ రామ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఓం 3డీ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.కాగా  బింబిసార సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న కళ్యాణ్ రామ్ ఓం 3డీ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇదిలావుండగా ఓం 3డీ సినిమా కోసం మూడేళ్లు కేటాయించానని కళ్యాణ్ రామ్ తెలిపారు.పోతే ఓం 3డీ సినిమా కథను నేను చాలా నమ్మానని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.పోతే ఆ సినిమా ఫలితం నన్ను చాలా నిరాశకు గురి చేసిందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. కాగా ఆ సమయంలో నేను వెళ్లే దారి సరైన దారేనా? సినిమాలకు దూరమవుదామా?

అని అనిపించిందని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు. అయితే ఆ సినిమా విడుదలైన తర్వాత కొన్ని నెలల పాటు ఎవరినీ కలవలేదని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.ఇదిలావుండగా ఆ సమయంలో కుటుంబం నాకు అండగా నిలబడిందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.పోతే  బింబిసార సినిమా ఫలితం విషయంలో నమ్మకంతో ఉన్నానని కళ్యాణ్ రామ్ తెలిపారు.అయితే  సొంతంగా వీఎఫ్ఎక్స్ సంస్థ ఉండటం వల్ల బడ్జెట్ భారం కొంతమేర తగ్గిందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఇక బింబిసార సినిమా నచ్చడంతో దిల్ రాజు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు తీసుకున్నారని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: