రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు అండ్ డ్యూటీ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ మసాలా సినిమాగా రాబోతూ ఉండగా ఈ చిత్రంపై రవితేజ అభిమానులు భారీ స్థాయిలోనే అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ప్రేక్షకులలో విశేషమైన ఆసక్తిని కనబరుస్తుంది. అందుకే ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందనే భావన చిత్ర బృందంలో ఉంది.

ఇకపోతే రవితేజ అంతకుముందు చేసిన సినిమాతో భారీ డిజాస్టర్ పొందడం ఈ సినిమా విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. గతంలో రవితేజ చాలాసార్లు ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాడు. భారీ ఫ్లాపులు వచ్చిన సమయంలోను ఒక భారీ విజయాన్ని అందుకొని మళ్ళీ తన కెరీర్ను నిలుపుకున్నాడు. ఆ విధంగా ఇప్పుడు రవితేజ మరొకసారి తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వెరైటీ కథనంగా రూపొందిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉండగా కాస్త ఆలస్యంగా ఈ చిత్రం విడుదల అవుతుందని చెప్పాలి. 

కారణం ఏదైనా రామారావు ఆన్ డ్యూటీ చిత్రంపై కొన్ని వర్గాలు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తుందని తెలుస్తుంది. మొదటి నుంచి ఈ చిత్రంపై ఎలాంటి బజ్ లేదని , ఎలాంటి క్రేజ్ లేదని చెబుతున్నారు. ఒక్క మాస్ రాజా రవితేజ తప్ప ఈ సినిమాలో ఆకట్టుకునే అంశం మరొకటి లేదని వారు చెబుతున్నారు. నిజానికి వారు చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం ఉందో తెలియదు కానీ ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకునే అంశం ఏదైనా ఉంది అంటే అది రవితేజ ఒక్కడే అని చెప్పాలి. అయితే ఆయన కోసం మాత్రమే సినిమా చూసే వారు తప్ప మిగతావారు ఈ సినిమాను చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించరు మరి కంటెంట్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకొని వారిని థియేటర్లకు రప్పిస్తుందా అనేది చూడాలి. గత కొన్ని రోజులుగా థియేటర్లలో విడుదలైన సినిమాలకు భారీ స్థాయిలో నిరాశ ఎదురవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: