అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ అయ్యింది. ఎన్నో భారీ అంచనాలు నడుమ విడుదలైన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని అక్కినేని అభిమానులు భావించారు. కానీ ఆ సినిమా వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఏమాత్రం ఆలచించలేకపోయింది. దాంతో నాగచైతన్య ఇప్పుడు మళ్లీ ఒక హిట్ సినిమా చేయవలసిన అవసరం ఏర్పడింది. అంతకుముందు ఆయన చేసిన లవ్ స్టోరీ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా ఆ తరహాలోనే ప్రేమకథా సినిమాగా తరికెక్కిన ఈ చిత్రం భారీ ఫ్లాప్ ను ఎదుర్కొంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగచైతన్య చేస్తున్న తదుపరి సినిమాపై ఎంతో ఒత్తిడి నెలకొంది. విక్రమ్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాష చిత్రాన్ని చేస్తున్న నాగచైతన్య ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలోని ఓ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. ఇంకొంతమంది ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందని కూడా చెబుతున్నారు. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే అక్కినేని అభిమానులు నాగచైతన్య తో చేయబోయే సినిమాల వరుసపై క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇతర హీరోలు వారు నటించే రెండు మూడు సినిమాలు యొక్క అధికారిక ప్రకటనను ఇవ్వగా నాగచైతన్య మాత్రం ఈ విధంగా మౌనంగా ఉండడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు. ఏదేమైనా నాగచైతన్య స్టోరీ ఎంపిక పట్ల వారు కొంత కలవరపాటు పడుతున్నారు.

దానికి థాంక్యూ సినిమా ఫలితమే ఉదాహరణ. అయితే ఈ చిత్రానికి ఓటీటీ లో మంచి డిమాండ్ ఏర్పడుతుందని తెలుస్తుంది. కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రాన్ని ఓ టీ టీ లో చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. దీన్ని బట్టి థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి పెద్దగా ఇష్టపడడం లేదని అర్థమవుతుంది. ముఖ్యంగా మీడియం సైజు హీరోలకి థియేటర్లలోకి ప్రేక్షకులు రావడం పూర్తిగా మానేశారని తెలుస్తుంది దీని బట్టి మరి ఈ హీరోలు ఎలా తమ సినిమాలను ఆకర్షణీయంగా మార్చుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: