యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిధి అగర్వాల్ , నబా నాటేష్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ సినిమా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే.

అప్పటి వరకు అపజయాలతో సత మత మవుతున్న రామ్ పోతినేని కి మరియు పూరి జగన్నాథ్ కు ఈస్మార్ట్ శంకర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందించి , వీరిద్దరూ తిరిగి ఫుల్ ఫామ్ లోకి రావడానికి ఈ మూవీ సహాయపడింది. ఈ మూవీ కి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. మణిశర్మమూవీ కి అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర ను పోషించింది. ఇలా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ,  కలెక్షన్ ల వర్షాన్ని కురిపించిన ఈస్మార్ట్ శంకర్ మూవీ ని హిందీ లో రీమేక్ చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాలు సాధించిన మూవీ లను  హిందీ  మేకర్స్ తమ భాషలో రీమేక్ చేస్తూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే .

అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయం అందుకున్న ఈస్మార్ట్ శంకర్ మూవీ ని కూడా హిందీ లో రీమేక్ చేయనున్నట్లు సమాచారం . అందులో భాగంగా ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో  మంచి క్రేజ్ వున్నా నటులలో ఒకరు అయిన టైగర్ ష్రఫ్ హీరోగా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: