మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అయితే ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు . ఇదిలా ఉంటే మాస్ మహారాజా రవితేజ కొంచెం గ్యాప్ అనంతరం మళ్లీ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు .తాజాగా మాస్ మహారాజ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.అయితే ఈ సినిమా 29వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఇక మాస్ మహారాజ రవితేజ హీరోగా సరే ఎక్కుతున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేస్తూ సినిమాపై అంచనాలను పెంచారు.అయితే  ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు.కాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేయడమే కాకుండా ఈ సినిమాకి రివ్యూ కూడా ఇచ్చారు. అయితే ఇక ప్రస్తుత కాలంలో సమాజంలో జరుగుతున్న అవినీతి గురించి ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా తెలియజేశారని అయితే ఇందులో రవితేజ రామారావు అనే పాత్రలో ఒక ఎమ్మార్వో ఆఫీసర్ గా సందడి చేయనున్నట్లు వెల్లడించారు.

 అంతేకాదు  ఎంతో నీతి నిజాయితీ గల ఆఫీసర్ పాత్రలో ఈయన కనిపించనున్నారు.ఇదిలావుంటే కేవలం రవితేజ మాత్రమే ఎంతో నిజాయితీ గల ఆఫీసర్ గా ఉండగా తన చుట్టూ ఉన్న వారందరూ అవినీతిపరులుగా సినిమాలో చూపించారని,అయితే ఇక  ఇలాంటి అవినీతిని కుట్రలు కుతంత్రాలను రవితేజ ఎలా ఎదుర్కొన్నారనే విషయం గురించి సినిమా తెరకెక్కినట్లు సెన్సార్ సభ్యులు వెల్లడించారు.ఇకపోతే  మొత్తానికి ఈ సినిమా రవితేజ కెరియర్ లో ఒక మైల్ స్టోన్ అవుతుందని సెన్సార్ సభ్యులు రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ ఇచ్చారు. అయితే మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేయనుందో తెలియాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: