కన్నడ స్టార్ హీరో సుదీప్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. కన్నడ నాట స్టార్ హీరోగా స్టార్ డమ్ ఉన్న సుదీప్ ని టాలీవుడ్ లో ఈగ సినిమాతో విలన్ గా మార్చాడు రాజమౌళి.ఇక ఆ తరువాత సైరా, బాహుబలి లాంటి సినిమాలతో... అప్పటి నుంచి టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా బాగా అలరిస్తున్నాడు సుదీప్. తాజాగా విక్రాంత్ రోణ సినిమాతో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించాడు. ఇక ఈ మధ్య పాన్ ఇండియా ట్రెండ్ అనేది నడుస్తుండటంతో.. సుధీప్ కూడా తన సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశాడు.ఈరోజు (28 జులై) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది.అనూప్ బండారి దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ సినిమా రిలీజ్ కు భారీగా సన్నాహాలు చేశారు. ప్రమోషన్ ఈవెంట్స్ కూడా చాలా భారీగా చేశారు. ఇక విక్రాంత్ రోణ సినిమా యూఎస్ లో ముందుగానే రిలీజ్ అయ్యింది. ఇక ఈసినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు.ఈ సినిమా చూసి ఈ సారి సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా భాగా స్పందించారు.


విక్రాంత్ రోణ సినిమాను ఆకాశానికి ఎత్తారు. సౌత్ నుంచి మళ్ళీ మరో అద్భుతమైన సినిమా వచ్చింది, ఎందుకు ఇలా సౌంత్ ఇండస్ట్రీ సినిమాలతో అద్బుతాలు సృస్టిస్టోంది అని నార్త్ ఆడియన్స్ అంటున్నారు. ముఖ్యంగా విక్రాంత్ రోణ మ్యూజిక్ ఇంకా బ్రాగ్రౌండ్ స్కోర్ కు ఫిదా అవుతున్నారు ఆడియన్స్.కిచ్చ సుదీప్ పెర్ఫామెన్స్ అద్భుతమట. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మంచి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు సుదీప్.కాకపోతే ఇంట్రవెల్ బ్యాంగ్ అయితే అంత ఆకట్టుకోలేదు.సెకండ్ హాఫ్ చాలా బాగుంది.ఇక విక్రమ్ రోణా సినిమాలో హైలెట్ విజ్యూవల్ ఎఫెక్ట్స్, అనూపు బండారి డైరెక్షన్ తో పాటు ఆర్డ్ డైరెక్టర్ శిబు టాలెంట్ ఈసినిమా సెట్టింగ్స్ లో కనిపిస్తుంది.సినిమాకు విఎఫ్ ఎక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయంటున్నారు ఆడియన్స్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ కు ఫుల్ ఫిదా అవుతున్నారు. సుదీప్ లో వారు కొత్త కోణాన్ని చూశామంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: