సినిమా పరిశ్రమలో ఎవరైనా రాణించాలంటే ఒక పెద్ద స్టార్ సపోర్ట్ ఉండవలసిందే. అప్పుడే వారికి అవకాశాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో తప్పకుండా ఒక స్టార్ అభయ హస్తము ఉంటే వారికి మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. దర్శకుడైన హీరో అయినా నిర్మాత అయిన ఎవరో ఒకరు సదరు హీరోయిన్ కు అండగా నిలిస్తే తప్పకుండా ఆ హీరోయిన్ అగ్ర హీరోయిన్ గా మారి పెద్ద హీరోల సరసన నటించగలుగుతుంది. అలా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన సినిమాలలో నటించినా చాలామంది హీరోయిన్లకు మంచి భవిష్యత్తు ఇచ్చాడనే చెప్పాలి.

టాలెంట్ ఉంటే తప్పకుండా వారిని సపోర్ట్ చేస్తూ వారికి మంచి సినిమా అవకాశాలు వచ్చేలా చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఇప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్లందరూ కూడా త్రివిక్రమ్ సపోర్టుతో ఇంతటి స్థాయికి వచ్చిన వారే. తాజాగా మరొక హీరోయిన్ కూడా ఈ జాబితాలోకి చేరడానికి సిద్ధమయింది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన సంయుక్త మీనన్ ఇప్పుడు త్రివిక్రమ్ సపోర్టుతో మంచి సినిమా అవకాశాలను అందుకుంటుది. 

త్రివిక్రమ్ రచయితగా సముద్రఖని దర్శకత్వంలో తెరకేక్కబోయే సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో సాయి ధరంతేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి ధరంతేజ్ సరసన  నటించబోతోంది. అంతేకాదు ఈమెలో ఉన్న టాలెంట్లు గుర్తించి త్రివిక్రమ్ ఆమెకు మరిన్ని పెద్ద సినిమాల అవకాశాలు వచ్చేలా సిఫారసు చేస్తున్నాడట. మరి సంయుక్త ఈ సపోర్టును ఎంతవరకు ఉపయోగించుకుని అగ్ర హీరోయిన్ గా మారుతుందో చూడాలి. ఇప్పటికే ఆమెతో నటించడానికి చాలామంది హీరోలు క్యు లో ఉన్నారని తెలుస్తుంది. మంచి అందం, పొడవు , అభిమాన్యం ఉన్న ఈ ముద్దుగుమ్మ కు నిజంగా అన్ని కలిసొస్తే త్వరలోనే అగ్ర హీరోయిన్ గా చూడడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: