సొట్ట బుగ్గల సుందరి తాప్సీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఝుమ్మంది నాదం మూవీ తో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన తాప్సీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది .

ప్రస్తుతం వీలు చిక్కినప్పుడల్లా తెలుగు సినిమాల్లో నటిస్తున్న తాప్సి  ఎక్కువగా మాత్రం బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తోంది . అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఎక్కువశాతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తాప్సి అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తాప్సి 'దోబారా' అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. అనురాగ్ కశ్యప్మూవీ కి దర్శకత్వం వహించగా , నాజర్, పవలి గులాటి, రాహుల్ భట్, తదితరులు ఈ మూవీ లో ముఖ్య పాత్రల్లో నటించారు. మిస్టరీ యాక్షన్ డ్రామా  జోనర్ లో  ఈ మూవీ తెరకెక్కింది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ ను ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలతో మూవీ యూనిట్ ఎడిట్ చేసింది. దాంతో ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ప్రస్తుతం ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ ని ఆగస్ట్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. మరి ఈ మిస్టరీ యాక్షన్ డ్రామా మూవీ తో తాప్సీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: