నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ మరియు సంయుక్త మీనన్  హీరోయిన్ లుగా నటించగా , ఈ మూవీ కి మల్లడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు టీజర్ ,  ట్రైలర్ లను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన టీజర్ , ట్రైలర్ మరియు  ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ ను కూడా తాజాగా విడుదల చేసింది. తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసిన ట్రైలర్  కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో తో ఈ ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ప్రేక్షకుల నుండి ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించడంతో విడుదల అయిన 24 గంటల్లో బింబిసార రిలీజ్ ట్రైలర్ 12.30 వ్యూస్ ని మరియు 367.7 కే లైక్ లను సాధించింది.  ఓవరాల్ గా చూసుకుంటే ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే బింబిసార మూవీ లో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలలో నటించాడు. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలలో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో పోషిస్తున్న రెండు డిఫరెంట్ వేరియేషన్స్ కు సంబంధించిన  పాత్రలను మూవీ యూనిట్ రివిల్ చేసింది. ఆ పాత్రలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: