ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి . సీరియల్స్ ద్వారా  కెరీర్ మొదలు పెట్టిన రాజమౌళి ఇక ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తన సినిమాలతో ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పాలి.  జక్కన్న సినిమా కోసం పాటు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూసే అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.


 ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి అని చెప్పాలి. అయితే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. ఇక తన విజయం వెనుక కూడా తన భార్య రమ ఉంది అని రాజమౌళి ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు. వీరి దాంపత్య బంధం కూడా అభిమానులను తెగ ఆకర్షిస్తూ ఉంటుంది. వీరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. దర్శకుడు రాజమౌళి లవ్ స్టోరీ ఏకంగా సినిమా లెవల్ లో ఉంటుందట. రాజమౌళి పెదనాన్న కుమారుడు ఎం.ఎం.కీరవాణి. రాజమౌళి సినిమా లకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఈయనే చేస్తాడు అనే విషయం తెలిసిందే.


 ఇక ఎం.ఎం.కీరవాణి సతీమణి పేరు శ్రీ వల్లి. అంటే రాజమౌళికి వదిన అవుతుంది. ఇక శ్రీవల్లి సొంత చెల్లెలు రమ. అప్పటికే రమాకు వివాహం జరిగి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతనే ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్న కార్తికేయ. భర్తతో గొడవల కారణంగా విడాకులు ఇచ్చేసింది రమ. ఆ తర్వాత రాజమౌళి తో రమాకు పరిచయం ఏర్పడగా.. పరిచయం ప్రేమగా మారడం జరిగింది.  విడాకుల తర్వాత  తన సోదరి శ్రీవల్లితోనే కీరవాణి ఇంట్లో ఉండేదట రమ. రాజమౌళితో అక్కడే  ఆమెకు పరిచయం ఏర్పడింది. రమా క్రమశిక్షణ మంచితనం రాజమౌళి ని తెగ ఆకర్షించాయట. ఒక కొడుకు ఉన్న ఆమెను వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు రాజమౌళి.


 ఇంకేముంది రాజమౌళి డిసైడ్ అయితే ఆచరణలో పెట్టడమే. పెళ్లి తర్వాత పిల్లలను వద్దనుకున్న ఈ దంపతులు.. ఒక అమ్మాయిని దత్తత తీసుకొని సొంత కూతురు గా పెంచుకుంటున్నారు. ఆమె పేరు మముఖ. 2001లో వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు రాజమౌళి సీరియల్స్ కు మాత్రమే దర్శకత్వం వహించారు. పెళ్లి తర్వాత జక్కన్నకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాలి. పెళ్లి తర్వాత రాజమౌళి వెండితెరపై డైరెక్ట్ చేసిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్  మంచి విజయం సాధించింది.. జక్కన్న సతీమణి రమా డిజైనర్గా పని చేశారు.  కేవలం ఒక్క సినిమా కాదు ఇక రాజమౌళి కెరియర్ మొత్తం జక్కన్నకు వెనకాలే ఉండి ధైర్యం చెప్పింది అతని సతీమణి రమా అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: