సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన సినిమాల్లో పోకిరి మూవీ ఒకటి. మహేష్ బాబు కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించిన పోకిరి సినిమా 28 ఏప్రిల్ 2006 వ తేదీన విడుదల అయ్యింది.

ఈ సినిమాకు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ,  గోవా బ్యూటీ ఇలియానా ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించగా , ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ కి మణిశర్మ అందించిన సంగీతం ఈ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించింది. అలాగే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ప్రకాష్ రాజ్ కూడా అద్భుతంగా నటించాడు. ఇక మహేష్ బాబు 'పోకిరి' సినిమాలో తన డిఫరెంట్ మేనరిజం డైలాగ్ లతో , సూపర్ బాడీ లాంగ్వేజ్ తో అదిరిపోయే ఫైట్ లు ,  డాన్సులతో ఈ సినిమాను మరో రేంజ్ కు తీసుకు వెళ్ళాడు. అలాగే పూరి జగన్నాథ్ కూడా ఈ మూవీ తో దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  

ఇలా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన పోకిరి సినిమాను ఈ సంవత్సరం మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్ట్ 9 వ తేదీన మళ్లీ విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ఓవర్సీస్ లో కూడా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్ లు స్టార్ట్ కాగా , టికెట్లు మొత్తం సోల్డ్ ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఆ కారణంతో మరో షో ను కూడా బుక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబు 'పోకిరి' మూవీ హవా ఫుల్ గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: