ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 సందడి  మళ్ళీ మొదలయ్యింది.అయితే  బిగ్ బాస్ మొదలు కావడానికి సమయం దగ్గర పడుతుండడంతో అభిమానుల్లో ఆత్రుత అంతకంతకు పెరుగుతోంది. ఇక గత సీజన్ కంటె ఈ సీజన్ లో అంతకుమించి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తాము అని షో నిర్వాహకులు చెప్పడంతో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు వస్తారు.అయితే కేవలం బుల్లితెర సెలబ్రిటీలు మాత్రమే వస్తున్నారా? లేదా వెండితెలా సెలబ్రిటీలు కూడానా? ఇక ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

పోతే  బిగ్ బాస్ ప్రేమికులు అయితే బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.బిగ్ బాస్ షోలో ఈసారి పాల్గొనే వాళ్లు వీళ్లే అంటూ ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇక  ఈ సారి బిగ్ బాస్ సీజన్ 6 కీ కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవరించబోతున్నారు.  గత సీజన్ లలో కొన్ని జంటలు లవ్ ట్రాక్ ని నడిపిన విషయం తెలిసిందే.ఇక  ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు అదేమి టంటే బిగ్ బాస్ 6 కోసం యాంకర్ ఉదయభానుని షో నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే ఇక  ఉదయభాను కోసం బిగ్ బాస్ యాజమాన్యం భారీగా పారితోషకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఉదయభాను మాత్రం బిగ్ బాస్ షోకీ రావడానికి నో చెప్పిందట.ఇకపోతే షో నిర్వాహకులు ఆమెను సంప్రదించగా..బిగ్ బాస్ కి రాలేనని కారణం ప్రస్తుతం కమిట్మెంట్స్ ఉన్నాయంటూ ఆమె దాటవేసిందట. ఇక ఉదయభాను విషయానికి వస్తే.. అప్పట్లో ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అయితే అప్పట్లో కొద్ది కాలం పాటు ఏ షోలో, ఏ ఈవెంట్ లో చూసినా కూడా ఉదయభాను వేరే వినిపించేది.ఇక  అంతేకాకుండా ఎంతోమంది యాంకర్లు ఉదయభాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వెండితెరకు యాంకర్ లుగా కూడా పరిచయం అయ్యారు. అయితే ఇక  ఆ తర్వాత పెళ్లి పిల్లలు కారణంగా కొంతకాలం పాటు బుల్లి తెరకు అటు వెండితెరకు దూరమైన విషయం తెలిసిందే.  ఈ మధ్యకాలంలో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఉదయభాను అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: