ప్రస్తుత  కాలంలో ఓటీటీ(OTT )ల హావా బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.. ఇక చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రిలీజ్ అయినా కొద్దిరోజులకే ఓటీటీల్లో సినిమాలు ప్రత్యక్షం అవుతున్నాయి.అయితే దాంతో థియేటర్స్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందని ప్రడ్యూసర్స్ మొత్తుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు.ఇదిలావుంటే  సినిమా రిలీజ్ అయినా రెండు, మూడు వారలకే ఓటీటీలో సినిమా రావడంతో నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని కొందరు ఆందోళన చేస్తున్నారు. ఇకపోతే బాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితీ స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో కంటే ఓటీటీలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

కాగా స్టార్ హీరో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి హీరోల సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి.అయితే  థియేటర్స్ తో పోల్చుకుంటే ఓటీటీల్లోనే కొన్ని సినిమాలకు మంచి వ్యూవర్ షిప్ దక్కుతోంది.అంతేకాదు తన సినిమాను మాత్రం అంత తొందరగా ఓటీటీకి వదలనంటున్నారు స్టార్ హీరో అమీర్ ఖాన్.ఇకపోతే అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా.ఇక  ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్- కిరణ్ రావు – వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించాయి. అయితే ఈ ఏడాది ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు-తమిళం-హిందీలో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇదిలావుంటే ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలోని నటిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. అయితే ఇక  ఈ సినిమా ను ఆరు నెలల తర్వాతనే ఓటీటీలో రిలీజ్ చేస్తామని అమీర్ ఖాన్ ప్రకటించారు. కాగా  ఈ సినిమాను ఇండియన్, జపాన్, చైనా అన్ని భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట అమీర్.పోతే  6 నెలల వరకు సినిమా ఓటీటీకి రాదు కాబట్టి ప్రేక్షకులు థియేటర్స్ లోనే ఈ సినిమా చూడాల్సిందే అనే విశ్లేషకులు అంటున్నారు.అయితే  ఇక ఈ సినిమా పై అమీర్ ఖాన్ చాలా ధీమాగా ఉన్నారు. కాగా ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ ఆనుతుందని అమీర్ ఖాన్, చిత్రయూనిట్ నమ్ముతున్నారు. అయితే మరి ఈ సినిమా ప్రేక్షకులను ఈ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: