మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం విడుదల అయిన క్రాక్ మూవీ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని సూపర్ ఫామ్ లోకి వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. అలా క్రాక్ సినిమాతో పోయిన సంవత్సరం అదిరిపోయే విజయాన్ని అందుకున్న మాస్ మహారాజ రవితేజ ఈ సంవత్సరం  ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఖిలాడి సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇప్పటికే ఈ సంవత్సరం ఖిలాడి మూవీ తో బాక్సాఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న రవితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీకి శరత్ మండవ దర్శకత్వం వహించాడు.  రామారావు ఆన్ డ్యూటీ సినిమా నిన్న అనగా జూలై 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే రామారావు ఆన్ డ్యూటీ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ ను తెచ్చుకుంది. కాకపోతే ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటం వల్ల ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.
 
నైజాం : 85 లక్షలు , సీడెడ్ : 52 లక్షలు , యూ ఏ : 45 లక్షలు , ఈస్ట్ : 31 లక్షలు , వెస్ట్ : 16 లక్షలు , గుంటూర్ : 24 లక్షలు , కృష్ణ : 17 లక్షలు , నెల్లూర్ : 12 లక్షలు ,  రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రామారావు ఆన్ డ్యూటీ మూవీ 2.82 కోట్ల షేర్ , 4.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 0.25 కోట్లు .
ఓవర్ సీస్ లో : 35 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రామారావు ఆన్ డ్యూటీ మూవీ 3.42 కోట్ల షేర్ , 5.95 కోట్ల క్రాఫ్ట్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: