బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బోనీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ఈయన కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా కోలీవుడ్ సినిమాలను కూడా నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.ఇక శ్రీదేవి బోని కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు జాన్వీ కపూర్. కాగా ధడక్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన జాన్వీ కపూర్ పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.పోతే ఈమె సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.

అయితే గతంలో ఎన్నోసార్లు ఈ ముద్దుగుమ్మ తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక తన పెళ్లి తిరుపతిలోనే సాంప్రదాయబద్ధంగా ఐదు రోజుల పాటు జరగాలని ఈమె తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ మనకు తెలిసిందే. అయితే ఇక  తాజాగా బోనీ కపూర్ తన కుమార్తె జాన్వీకపూర్ పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా తనకు కాబోయే అల్లుడు విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టారు.ఇకపోతే బోనీ కపూర్ తన కుమార్తె జాన్వీకపూర్ పెళ్లి విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అయితే ఇక  తనకు కాబోయే అల్లుడు ఎవరైనా సరే అతనిలో మాత్రం ఒక క్వాలిటీ కంపల్సరీ ఉండాలనే కండిషన్ పెట్టారట.

ఇకపోతే  మరి ఆ కండిషన్ ఏమిటి ఆ క్వాలిటీ ఏమిటి అంటే.. అయితే తనకు కాబోయే అల్లుడు తనకన్నా ఎత్తు ఉండాలనే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.ఇక  బోనీ కపూర్ హైట్ 6.1 ఉండగా తనకు కాబోయే అల్లుడు ఇంతకన్నా ఎక్కువ ఎత్తు ఉండాలని చెప్పడమే కాకుండా మా నాన్న మమ్మల్ని ప్రపంచం మొత్తం తిప్పి చూపించారని, తమను పెళ్లి చేసుకోబోయే వాళ్లకు చెప్పాలని బోనీకపూర్ కండిషన్ పెట్టారట. అయితే ఇలా ఈయన తన కూతుర్ల విషయంలో తనకన్నా ప్రేమగా తన కూతుర్లను చూసుకునే వారు అల్లుళ్ళుగా రావాలని చెప్పినట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: