కమెడియన్ గా.. హీరోగా .. ప్రొడ్యూసర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ తరచూ వివాదాల్లో తలదూరుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే మరొక వివాదానికి తెరలేపడంతో వరుస కాంట్రవర్సీలకు గురి అవుతున్నారు. నిజానికి టాలీవుడ్ ఆక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు ఒకటో తేదీ నుంచి షూటింగ్ బంధు లకు పిలుపు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇక దీనిపై బండ్లన్న కి కౌంటర్ పడుతుందని చెప్పవచ్చు. నిజానికి సి కళ్యాణ్ నుంచి మొదలైన కౌంటర్లు ఇప్పటికీ కూడా బండ్ల గణేష్ పై కొనసాగుతూనే ఉండడం..దీనిపై బండ్ల గణేష్ ఏ స్థాయిలో స్పందిస్తాడా ? అంటూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు .ఇక అనుకున్నట్టుగానే ఈ వివాదం పై బండ్ల గణేష్ స్పందించడం జరిగింది.

తాజాగా ఒక ఆడియో విడుదల చేసిన బండ్ల గణేష్ అందులో కనీసం ఏ లైట్లు వాడుతారో కూడా తెలియని మంగళారం బ్యాచులు ఉన్నాయంటూ సెటైర్లు వేయడంతో పెద్ద ఎత్తున వివాదాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా భారీ చిత్రాల నిర్మాత సి అశ్వినీ దత్ చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు.ఆయన  50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారన్నారు. ఇకపోతే ఏ హీరోని కూడా.. డైరెక్టర్  ను కూడా మీ పారితోషకం తగ్గించుకోమని చెప్పే అర్హత ఏ నిర్మాతకు లేదు అని.. అలా అడగకూడదని ముఖ్యంగా కార్లలో రకాలు ఉంటాయని ..కానీ ఒక్క కారుకు ఒక్కో రేటు ఉన్నట్టే ఒక్క హీరోకి కూడా ఇంకో రేటు ఉంటుందని పండ్ల గణేష్ తెలిపారు.

ఇక మనకు నచ్చి ఎంత మార్కెట్ చేసుకోవాలో తెలిసినప్పుడు మాత్రమే హీరోను అప్రోచ్ అయ్యి సినిమా తీస్తే బాగుంటుందని.. కానీ హీరోల పారితోషకం తగ్గించుకోమని చెప్పడం కరెక్ట్ కాదని తెలిపాడు. అంతేకాదు గిల్డ్ సభ్యుల్లో ఉన్న నిర్మాతలలో షీట్లు, కాల్ సీట్లకి కూడా తేడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఇలా మాట్లాడడం పద్ధతి కాదు అని అనడంతో బండ్ల గణేష్ పై మరొక వివాదం తలెత్తే అవకాశం కల్పిస్తోంది. ఇక నేటిజెన్లు కూడా నిర్మాతలంతా మంగళారం బ్యాచ్ అంటారా బండ్లన్న అంటూ కామెంట్లు చేయడంతో ఈ విషయంపై గిల్డ్ సభ్యులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: