రవితేజ పై గత కొన్ని రోజులు గా వస్తున్న విమర్శల గురించి అందరికీ తెలిసిందే. ఆయన నిర్మాతల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే కిలాడి సినిమా సమయం లో దర్శకుడికి ఆయనకు మధ్య వచ్చిన విభేదాల గురించి అందరికీ తెలిసిందే. బహిరంగంగానే ఆయనపై ఎంతో వెతకారకంగా మాట్లాడారు రవితేజ. అయితే అన్ని విమర్శల మధ్య ఎన్నో అనుమానాల మధ్య విడుదలైన ఖిలాడీ సినిమా ప్రేక్షకుల ను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

క్రాక్ లాంటి భారీ విజయాన్ని అందుకున్న సినిమా తరువాత విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ను ఏమాత్రం అలరించలేకపోయింది. ఆ తర్వాత మాస్ రాజా చేస్తున్న మరొక సినిమా రామారావు ఆన్ డ్యూటీ చిత్రంపై ఆయన అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నా రు. నిన్న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాగా అది ఏ మాత్రం వారిని ఆకట్టుకోలేకపోయింది. గతంలో సినిమాల ఎంపికలో మంచి వైవిధ్యతను చూపించి భారీ విజయాలు అందుకున్న రవితేజ ఇప్పుడు సినిమాపై కాకుండా రెమ్యూనరేషన్ పై దృష్టి పెట్టి తన ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడమే విమర్శ ఎదుర్కొంటున్నాడు.

దానికి ఉదాహరణ ఇప్పుడు విడుదలైన గత రెండు సినిమాలే. నిర్మాతల డబ్బును రిస్క్ లో పెట్టి తన ఆనందం కోసం రవితేజ ఈ విధం గా సినిమాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది సినిమా విశ్లేషకుల విమర్శ. మరి ఆయన చేతిలో మరో మూడో సినిమాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాలు ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి. ధమకా అనే ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాడు రవితేజ. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రావణాసుర,టైగర్ నాగేశ్వర రావు సినిమా రాబోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: