హీరో వెంకటేష్ గురించి  పరిచయం అక్కర్లేదు. సీనియర్ హీరో వెంకటేష్ అనేకమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇకపోతే ఇటీవల ఆయన ఎఫ్ 3 సినిమాతో మరోసారి అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే .ఇక ఈయన టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ హీరో. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలయ్యలతో సమానంగా స్టార్ హీరోగా ఎదిగారు.పోతే ఫ్యామిలీ సినిమాలతో పాటు యాక్షన్ హీరోగా కూడా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఎమోషన్స్, కామెడీ.. ఇలా యాక్టింగ్ లో ఏ సన్నివేశానాన్నై వెంకటేష్ రక్తికట్టించగలరు.

 ఇదిలావుంటే ఇప్పటికీ హీరోగా ఇంకా సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్నారు.ఇదిలావుంటే హీరో వెంకటేష్ సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్ కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఖాళీ సమయాల్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా గడుపుతూ ఉంటారు. అయితే ఇక  వెంకటేష్ కూతురు ఆశ్రిత ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. కాగా తండ్రి సినిమాల్లో పాపులర్ అయితే కూతురు ఆశ్రిత ఫుడ్ వ్లాగర్ గా రాణిస్తోంది. ఇకపోతే తెలుగువారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతుంది.కాగా  ఇన్ స్టాగ్రామ్ లో ఇన్పినిటీ ప్లాటర్ పేరిట అకౌంట్ ఓపెన్ చేసిన ఆశ్రిత..

అందులో ఫుడ్ కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంది. అంతేకాదు అలాగే యూట్యూబ్ ఛానెల్ కూడా ఓపెన్ చేసిన ఫుడ్ వీడియోలు పెడుతుంది.ఇదిలావుంటే  తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబితాను హోపర్ డాట్ కామ్ విడుదల చేసింది. ఇక ఇందులో ఆశ్రిత ప్రపంచవ్యాప్తంగా 377వ ర్యాంక్ లో ఉంది. ఇకపోతే ఆసియాలో 27వ ర్యాంకులో ఉంది.బ్రాండ్ కొలాబరేషన్స్ తో కోట్లలో సంపాదిస్తుంది.ఇక ఆశ్రితకు ఫుడ్ మీద బాగా ఆసక్తి ఉండేది. ఇక తండ్రి వెంకటేష్, పెదనాన్న సురేష్ బాబు విదేశాలకు వెళ్లి వచ్చినప్పుడు ఫుడ్ విషయాల గురించి ఎక్కువగా తెలుసుకునేదట. అయితే ఫుడ్ ఎలా ఉంటుంది. అంతేకాదు వెరైటీల గురించి అడిగి తెలుసుకుంటుందట. ఇక ఇప్పటికీ కూడా అలాగే చేస్తుందట. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: