మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.. ఈ సినిమా నిన్నటి రోజున థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొదటి రోజు మిశ్రమ స్పందనను తెచ్చుకున్నది. ఫ్యాన్స్ సైతం ఈ సినిమాలతో ఫుల్ డిసప్పాయింట్ అయినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా రవితేజ తన సినిమాలలో ఉత్సాహ భరితమైన నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకులను కామెడీ టైమింగ్ తో ఎమోషనల్ తో బాగా ఆకట్టుకుంటూ ఉండేవారు. అయితే సినిమా ఫ్లాప్ అయినా కూడా కొన్ని సన్నివేశాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోయేలా కనిపిస్తున్నాయి. అందుకే అభిమానులు రవితేజ ఎనర్జిటిక్ లెవెల్స్ ను ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు.

కానీ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఏ ఒక్క అంశము లేకపోవడంతో అభిమానుల సైతం నిరాశపరిచినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్,  టీజర్ ప్రమోషన్లతోనే రవితేజ అనుకున్న దానికంటే భిన్నంగా ఉన్నట్లుగా అనిపించింది.. అయితే రవితేజసినిమా చేయాల్సి ఉండకూడదని అభిమానుల సైతం భావిస్తున్నారు . ఈ సినిమా ఏ దశలో కూడా ఆకట్టుకోలేక పోయినట్లు తెలియజేశారు. ఇక అంతే కాకుండా చిరంజీవికి ఆచార్య సినిమా ఎలాగో రవితేజకు రామారావు సినిమా కూడా అలాగే అన్నట్లుగా పలువురు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు


చిరంజీవి హీరో కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ కావడంతో చిరు ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో యాక్టింగ్ తో అలరించిన కానీ స్క్రీన్ మీద డల్లుగా కనిపించారు. దీంతో నటనలో ఏమాత్రం ఉత్సాహం లేకపోవడంతో అభిమానుల సైతం నిరుత్సాహ చెందారు. దీంతో ఈ సినిమా వైఫల్యానికి కారణం కొరటాల శివ మీదికి అభిమానుల సైతం తోసి పుచ్చడం జరిగింది. ప్రస్తుతం రవితేజ సినిమా కూడా అలాంటి పాత్రలో నటించినట్లుగా తెలుస్తోంది . పూర్తిగా తన సినిమాని డైరెక్టర్ కి సరెండర్ చేసినట్లుగా అనిపిస్తోందని అభిమానులు తెలియజేస్తున్నారు. అయితే వాస్తవానికి రవితేజ సినిమాలు గత కొంతకాలంగా సరిగా ఆడలేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: