దసరా సంక్రాంతి సీజన్ లు సినిమా హీరోలకు ఎంతో ప్రియమైనవి. దానికి కారణం ఆ సీజన్ లలో విడుదల అయ్యే సినిమాలు భారీ కలెక్షన్లను అందుకోవడమే. ఇప్పటికే పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా ఆ సమయంలో విడుదలయి ఎన్నో సంచలన రికార్డులను సృష్టించాయి. దాంతో పాటు భారీ కలెక్షన్లను కూడా దక్కించుకున్నాయి. ఆ విధంగా ఇప్పుడు మరొకసారి ఈ సీజన్ లో పోటీ పడడానికి ఇద్దరు హీరోలు సిద్ధమవుతున్నారు.  మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది దసరా సందర్భంగా తన సినిమా ను విడుదల చేయబోతుండడం విశేషం.

 ఇక అదే సమయంలో నందమూరి బాలకృష్ణ కూడా తాను నటిస్తున్న ఓ సినిమాను విడుదల చేస్తున్నారు. ఆ విధంగా ఇద్దరు హీరోలు చాలా రోజుల తర్వాత దసరా సీజన్ లో ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఇకపోతే సంక్రాంతి కానుకగా కూడా వీరిద్దరూ నటిస్తున్న సినిమాలు విడుదల కాబోతున్నాయి అని అంటున్నారు. ఆ విధంగా ఈ రెండు సీజన్ లలో మీరు ప్రేక్షకుల ముందు రావాలని డిసైడ్ అవ్వడం వారి అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 

ఆ తర్వాత ఆయన చేసిన భోళా శంకర్ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ విధంగా ఆయన ఈ రెండు సినిమాలను విడుదల చేస్తున్న క్రమంలో బాలకృష్ణ కూడా ఇప్పుడు నటిస్తున్న రెండు సినిమాలను దసరాకు ఒకటి అలాగే సంక్రాంతికి ఒకటి విడుదల చేయాలని భావిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను దసరా పండుగ కు విడుదల చేస్తుండగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే సినిమాను సంక్రాంతి కానుక గా విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి వీరిద్దరూ మాస్ లో భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుంతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: