టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ ల పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఎవరికి తెలియదు. సక్సెస్ ఉన్నప్పుడు ఒకలాంటి కెరియర్ వారికి ఏర్పడుతుంది. సక్సెస్ లేనప్పుడు వారికి కెరియర్ అనేదే ఉండదు. ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ అందుకొని అగ్ర హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు చేతిలో సినిమా అవకాశాలు లేక దాదాపుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దూరమైపోయిందనే అనుకుంటున్నారు. అందరి హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ రేటు లేని కారణంగానే ఇంత త్వరగా సినిమా పరిశ్రమ నుంచి దూరమైపోయిందని చెప్పవచ్చు.

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే ఓ చిన్న సినిమాతో మంచి విజయాన్ని అందుకొని అందరి కళ్ళల్లో పడింది. ఆ తర్వాత పెద్ద హీరోల సరసన కూడా నటించడం మొదలు పెట్టింది. వాస్తవానికి ఆమె పెద్ద హీరోల సరసన నటించింది కానీ పెద్ద విజయాలు మాత్రం అందుకోలేదని చెప్పాలి. అలా సక్సెస్ రేట్ కూడా బాగా ఉంటే ఆమె కెరీర్ ఇప్పుడు వేరేలా ఉండేది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలు చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ చిత్రాలు మంచి విజయం అందుకోకపోవడంతో ఈమె అక్కడ కూడా తన కెరీర్ ను ముదిగించుకోవలసి వచ్చింది. 

మరి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు కొన్ని బిజినెస్ లు చేస్తున్న క్రమంలో హీరోయిన్ గా పూర్తిగా తన ప్రయత్నాలను ఆపేసినట్లేనా అనేది ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మరి ఆమె తన రెండో ఇన్నింగ్స్ ఏదైనా ప్రారంభిస్తుందా అనేది కూడా చూడాలి. ఇప్పటికే హైదరాబాదులో జిమ్ ఏర్పాటు చేసి ఆ బిజినెస్ చేస్తున్న ముద్దుగుమ్మ ముంబైలో క్యాస్టింగ్ ఏజెన్సీని కూడా పెట్టబోతున్నట్లూ వార్తలు ఆ మధ్య వచ్చాయి. ఇప్పుడు మరొక బిజినెస్ కూడా ఆమె చేస్తుందట. చూడబోతే రకుల్ బిజినెస్ ఉమెన్ గా ఎదిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: