టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇద్దరు మీడియం రేంజ్ హీరోలు నటిస్తున్న సినిమాలపై ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి ఏర్పడింది. నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా మంచి అంచనాలను ఏర్పరచుకుంది. ఆయన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్న కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు కలిగి ఉండడానికి కారణం ఈ చిత్రంలో నాని గెటపే కారణం అని చెప్పాలి. పుష్ప సినిమా తరహాలో ఈ సినిమాలో ఆయన కనిపించబోతున్నాడని ఇప్పటికే వచ్చిన లుక్స్ ను బట్టి చెప్పవచ్చు.

గ్లింప్స్ లో ఆయన కనిపించిన తీరును చూసి తప్పకుండా ఈ చిత్రం ఆయనకు మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందని అందరూ భావిస్తున్నారు. ఆ తర్వాత నాని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న విజయం కూడా ఈ సినిమాతో దక్కుతుందని అందరూ చెబుతున్నారు. మరి ఈ చిత్రం ఏ విధమైన విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇక అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమాపై కూడా ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు.

కానీ పలు కారణాలవల్ల ఈ చిత్రాన్ని అప్పుడు విడుదల చేయలేకపోతున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా తప్పకుండా మంచి స్థాయిలోనే విజయాన్ని అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంటుందో చూడాలి. ఇప్పటికి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. వరుసగా మూడు సినిమాలతో ఫ్లాప్ అందుకున్న అక్కినేని అఖిల్ నాలుగో సినిమాతో మోస్తరు విజయాన్ని అందుకున్నాడు కానీ అక్కినేని అభిమానులు ఆకలి తీరాలంటే ఈ ఐదవ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవలసి ఉంది. ఈ సినిమా యొక్క విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: