భారి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరిని చెప్పవచ్చు మలయాళంలో సిని నిర్మాతగా సురేష్ కుమార్ మలయాల నటి మేనక ముద్దుల కూతురు కీర్తి సురేష్. ఈమె చదువుకుంటున్న రోజులలోనే బాలనాటిగా ఎన్నో సినిమాలలో నటించింది. హీరోయిన్గా మొదటి చిత్రం గీతాంజలి.. చేసింది. కానీ టాలీవుడ్ లోకి మాత్రం నేను శైలజ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినది. దీంతో తెలుగు ప్రేక్షకులకు రెమో సినిమాతో బాగా అట్రాక్టివ్ గా మారింది. ఇక తర్వాత తెలుగు, తమిళ ,మలయాళం వంటి భాషలలో పలు సినిమాలలో నటించింది. గ్లామర్ రోల్స్ పాత్రలు ఎప్పుడో కూడా చేయలేదు తన హద్దులు దాటి అందాల ఆరబోత కూడా చేయలేదు ఈ ముద్దుగుమ్మ.


సౌత్ లో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకున్నది. మహానటి సినిమాతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. దీంతో జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు దక్కించుకున్నది. అయితే ఈ చిత్రం తర్వాత ఇమే కెరీర్ అంతగా సాఫీగా సాగలేదు. ఈమె చేసిన సినిమాలు అన్నీ వరుసగా డిజాస్టర్ అయ్యాయి కెరియర్ చాలా డల్ గా ఉన్న సమయంలో మహేష్ తో కలిసి సర్కారు వారి పాట సినిమా చేసి మరొకసారి సక్సెస్ అందుకుంది.


అయితే కీర్తి సురేష్ సినిమాల ఎంపికలో మాత్రం మునుపటి వేగం ఎక్కువగా కనిపించలేదు సినిమాలన్నీ అంత త్వరగా ఒప్పుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నది. కథ కు తన ప్రాధాన్యత ఎక్కువగా ఉంటేనే సినిమాలను ఒప్పుకుంటుందట. దీంతో ఈమె జోరు తగ్గిందని అభిమానుల సైతం గత కొద్దిరోజుల నుంచి చాలా ఆందోళన చెందుతున్నారు ఈ విషయంపై కీర్తి సురేష్ స్పందిస్తూ.. తనకు వేగంగా సినిమాలు చేయాలని ఆత్రం లేదు మంచి కథ వస్తే అప్పుడే సైన్ చేస్తానని తెలిపిందట. పది సినిమాలు చేస్తే కంటే ఒక సినిమా ఆలోచించి మంచి సినిమా చేస్తే ఎక్కువ రోజులు ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారని ఆమె తెలియజేసినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: