భారతదేశం లోనే ఉన్న గొప్ప గొప్ప దర్శకులలో ఒకరు అయిన మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం దర్శకుడిగా ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. 

అలా ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లను కూడా మూవీ యూనిట్ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్  ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది.  

తెలుగు లో పొంగే నది పేరిట ఈ సాంగ్ ని మూవీ యూనిట్ విడుదల చేయగా, ఈ సాంగ్ కి అనంత శ్రీరామ్ లిరిక్స్ ని రాసాడు. ఈ సాంగ్ కి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రభు, ఆర్.శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, రహ్మాన్, ఆర్ పార్తిబన్  ఈ మూవీ లో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా , ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్ లపై ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: