టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన ఛోటా కె నాయుడు మనందరికి తెలుసు .అయితే  హీరోలను అందంగా చూపించడంతో పాటు సినిమా రేంజ్ ను తన సినిమాటోగ్రఫీ ద్వారా పెంచే సినిమాటోగ్రాఫర్లలో చోటా కె నాయుడు ఒకరని చెప్పవచ్చు.ఇకపోతే ఈ తరహా జానర్ సినిమాలో తాను నటించడం ఇదే తొలిసారి అని చోటా కె నాయుడు చెప్పుకొచ్చారు. కాగా నందమూరి హీరోలు ఏది ఏమైనా చేసేద్దాం అని చెబుతారని అయన కామెంట్లు చేశారు.పోతే బింబిసార సినిమాలో కొన్ని రిస్కీ సన్నివేశాలు ఉన్నాయని ఆ సీన్లలో కూడా కళ్యాణ్ రామ్ భయపడకుండా చేశాడని చోటా కె నాయుడు చెప్పుకొచ్చారు.

అయితే గతంలోనే కళ్యాణ్ రామ్ తో పని చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల మిస్సైందని ఆయన తెలిపారు.ఇక  బింబిసార బాహుబలి స్థాయి సినిమా కాదని అయితే గొప్ప సినిమా మాత్రం అవుతుందని చోటా అన్నారు.అంతేకాదు  కొత్త దర్శకుడు అయినా షాట్ వృథా చేయకుండా వశిష్ట్ ఈ సినిమాను తెరకెక్కించారని చోటా తెలిపారు.ఇకపోతే నందమూరి హీరోలు షూటింగ్ లొకేషన్ కు చెప్పిన టైమ్ కు వస్తారని అయితే హీరోలు త్వరగా వచ్చినా పని విషయంలో కంగారు పెట్టరని షాట్ రెడీ అని చెప్పేవరకు ఎంతో ఓపికతో ఉంటారని చోటా అన్నారు.

కాగా కళ్యాణ్ రామ్ గత సినిమాలన్నీ ఒక రేంజ్ లో ఉంటే ఈ సినిమా మరో రేంజ్ లో ఉంటుందని చోటా కె నాయుడు చెప్పుకొచ్చారు. అయితే నందమూరి హీరోలు టైమింగ్ విషయంలో, కష్టపడే విషయంలో సేమ్ టు సేమ్ అని చోటా కె నాయుడు వెల్లడించారు.అయితే బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ ఆశలు నెరవేరడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పోతే  కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కాగా  కథల ఎంపికలో కళ్యాణ్ రామ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే వేగంగా సినిమాలు చేయడం కంటే నటించిన సినిమాలతో విజయాలను అందుకోవడంపై కళ్యాణ్ రామ్ దృష్టి పెడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: