అందాల ముద్దు గుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సంయుక్త మీనన్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన భీమ్లా నాయక్ మూవీ లో హీరోయిన్ గా నటించింది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ లో సంయుక్త మీనన్ దగ్గుబాటి రానా కి జోడిగా నటించింది . 

సినిమా మంచి విజయం సాధించడం తో సంయుక్త మీనన్ కి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది .  ఇది ఇలా ఉంటే సంయుక్తా మీనన్ తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా మల్లాడి వశిష్ట్ దర్శకత్వం లో తెరకెక్కిన బింబిసార మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా ఆగస్ట్ 5 వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వం లో ధనుష్ హీరో గా తెరకెక్కుతున్న సార్ మూవీ లో కూడా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోం ది . 

ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ ముద్దు గుమ్మ తాజా గా తనకు సంబంధించిన ఒక కోరిక ను బయటకి చెప్పేసింది . తనకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అని , చనిపోయే లోపు ప్రపంచమంతా తిరగాలని కోరిక ఉన్నట్లు తెలిపింది . అలాగే ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టం ఉందో తన వీపు మీద ఉన్న టాటూ నే చెబుతుంది అని కూడా సంయుక్త మీనన్ చెప్పు కొచ్చింది . ఇలా తాజాగా ఈ యంగ్ బ్యూటీ తనకు ఉన్న ఇష్టా న్ని వెళ్ల బుచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: