యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా ది వారియర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పోతినేని తన కెరియర్ లో మొట్ట మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకు తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన లింగుసామి దర్శకత్వం వహించగా , ప్రస్తుతం  వరుస అవకాశాలను దక్కించుకుంటు ఫుల్ జోష్ లో ఉన్న కృతి శెట్టి ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా నటించింది.  

ఆది పినిశెట్టి ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. మంచి అంచనాల నడుమ జూలై 14 వ తేదీన తెలుగు , తమిళ భాషల్లో విడుదల అయిన ది వారియర్ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. దానితో ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది.  అలా నెగిటివ్ టాక్ లభించడంతో ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు కూడా దక్కలేదు.  చివరగా ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అపజయం పాలయింది.  

ఇలా థియేటర్ లలో  ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ది వారియర్ మూవీ మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఆగస్ట్ 11 వ తేదీ నుండి ది వారియర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దామని మిస్ అయిన వారు ఉంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఆగస్ట్ 11 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది చేసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: