ఇక కన్నడ స్టార్ హీరో సుదీప్ కిచ్చా నటించిన తాజా చిత్రం 'విక్రాంత్ రోణ' అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించిన సంగతి అందరికీ కూడా తెలిసిందే.ఈ భారీ బడ్జెట్ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. జూలై 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో చాలా బాగా సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు అయితే అసలు చాలా అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరిచారు.కాగా, ఈ సినిమా రిలీజ్ అయిన కేవలం నాలుగే రోజుల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుని వావ్ అనిపించింది. ఈ విక్రాంత్ రోణ సినిమాను తెలుగులో కూడా మంచి అంచనాల మధ్య రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో అయితే మంచి బజ్ రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో బాగా సక్సెస్ అయ్యింది.


తొలిరోజు మౌత్ టాక్ బాగా రావడంతో వీకెండ్‌లో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ చాలా ఆసక్తిని చూపారు. దాని ఫలితంగా ఈ సినిమా నాలుగు రోజుల్లోనే నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.నిజానికి ఈ సినిమాను అయితే నైజాం ఏరియాలో చాలా తక్కువ రేటుకు కొనుగోలు చేశారు ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్. కానీ ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావడంతో వారు తమ సంతోషాన్ని బాగా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో సుదీప్ మరోసారి తెలుగు ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాను అనూప్ భండారి తెరకెక్కించగా, నీతా అశోక్ ఇంకా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: