టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు పైన నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కార్తికేయ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకొని భారీ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.  ఇలా కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి కార్తికేయ 2 సినిమా సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.  ఇది ఇలా ఉంటె ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు కొద్ది సేపటి క్రితమే మూవీ యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక ట్రైలర్ ను విడుదల చేసింది. ఆ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. కొద్ది సేపటి క్రితమే ఈ సినిమా నుండి రెండవ ట్రైలర్ ను రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ మూవీ యూనిట్ ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. మరి ఈ సినిమా 2 ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించగా, అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: