ఇక ప్రస్తుతం తెలుగు నిర్మాతల కౌన్సిల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సినిమా షూటింగులన్నిటికీ కూడా బ్రేకులు పడటం జరిగింది.హీరోలు ఇంకా అలాగే డైరెక్టర్లు ఎట్టి పరిస్థితులలో కూడా తమ రెమ్యూనరేషన్ లు తగ్గించుకోవాల్సిందే అంటూ నిర్మాతల కౌన్సిల్ తరఫునుంచి దిల్ రాజు కూడా డిమాండ్ చేస్తున్నారు.కానీ హీరోలు ఇంకా అలాగే డైరెక్టర్లు మాత్రం అసలు ఈ డిమాండ్ కి ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదు. తమ వల్లనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని ఆ మాత్రం రెమ్యూనరేషన్ ఉండాల్సిందేనని డైరెక్టర్లు ఇంకా హీరోల నుంచి వాదన వినిపిస్తుంది. ఇక తాజాగా దిల్ రాజు నిర్మించిన "ఎఫ్ 3" ఇంకా అలాగే "థాంక్యూ" సినిమాలు అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి. అలాగే బాలీవుడ్ లో కూడా "జెర్సీ" సినిమా రీమేక్ ని నిర్మించిన దిల్ రాజు అక్కడ కూడా మంచి ఫలితాన్ని అందుకోలేక పోయారు.


అయితే ఇక మరోవైపు హీరోలు ఇంకా డైరెక్టర్లు మాత్రమే కాక కొంతమంది నిర్మాతలు కూడా దిల్ రాజు డిమాండ్లతో ఏకీభవించకపోవడం గమనార్హం.ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అయితే షూటింగులు వాయిదా పడితే మరింత ఇబ్బందులు కలుగుతాయని వారి ఆరోపణ. అశ్వినీ దత్ ఇంకా అలాగే బండ్ల గణేష్ వంటి నిర్మాతలు ఇప్పటికే దిల్ రాజుకి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. "ఈ దిల్ రాజు రూల్స్ తో మేము ఏకీభవించడం లేదు. మేము ఇక మా షూటింగ్ ని కొనసాగిస్తున్నాము" అని అశ్వినీదత్ ఇప్పటికే ప్రకటించేశారు.అలాగే నెటిజన్స్ కూడా దిల్ రాజు తీరుపై మండిపడుతున్నారు. మీరు మంచి సినిమాలు తీస్తే జనాలు ఎందుకు చూడరు? అని ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్లు హీరోల వల్లనే జనాలు సినిమాలు చూస్తున్నారు. అని హీరోల ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: