సూపర్ స్టార్ మహేష్ - అల్లు అర్జున్ ఇద్దరు ఇద్దరే. ఓ పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినా కానీ తమకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న నటులు వీళ్ళు.వీరు ఎవరి విషయాల్లో వారే బెస్ట్. నటనలో మహేష్ బాబు బెస్ట్ అయితే, డాన్సులు వేయడంలో అల్లు అర్జున్ బెస్ట్ అన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఫ్యాన్ బేస్ విషయానికొస్తే ఇద్దరూ హీరోలు తక్కువోలేం కాదు. అయితే మహేష్ కి ముందు నుంచి కల్ట్ ఫ్యాన్ బేస్ అనేది వుంది. అల్లు అర్జున్ కి పుష్ప సినిమా నుంచి దేశావ్యాప్తంగా ఫ్యాన్స్ చాలా ఎక్కువయ్యారు.ఇక అసలు విషయాల్లోకి వస్తే,ఈ ఇద్దరికీ ఇప్పుడు ఓ విషయంలో పెద్ద వార్ మొదలవ్వబోతోంది.మన తెలుగు స్టార్ హీరోల్లో అత్యధిక కమర్షియల్ యాడ్స్ లో నటించింది ఎవరు.. అంటే ఠక్కున మనకు గుర్తొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబే.తెలుగులో ఆయన తరువాతే ఎవరన్నా.


ఓ రకంగా చెప్పుకోవాలంటే సూపర్ స్టార్ మహేష్ బాబుని మినహా యాడ్స్ విషయంలో ఒకటి అరా తప్ప ఇంకెవ్వరికీ యాడ్స్ పెద్దగా లేవు. అయితే తాజా సర్వే ప్రకారం అల్లు అర్జున్ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు మాదిరిగా యాడ్స్ లో నటించబోతున్నాడంటూ టాక్ వినబడుతోంది.ప్రస్తుతం బన్నీ చేతిలో పలు కంపెనీల ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో అత్యధిక యాడ్స్ లో కనిపిస్తున్న హీరోల జాబితాలో అల్లు అర్జున్ ప్రస్తుతం రెండవ స్థానంలో వున్నారు. ముందు ముందు అల్లు అర్జున్ మరిన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మొదలుకుని ప్రతి రంగంలో కూడా అల్లు అర్జున్ తన ముద్రను వేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో రాబోతున్న రెండేళ్లలో అల్లు అర్జున్ మహేష్ బాబుతో సమానంగా యాడ్స్ చేయొచ్చు అనే కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: