విజయ్ దేవరకొండ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తెలంగాణాలో పుట్టి పెరిగిన విజయ్ దేవరకొండకు సహజంగానే ఇక్కడి మాటతీరు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ పై మంచి అవగాహన ఉంది. సత్యసాయి బాబా పుట్టపర్తి స్కూల్ లో చదువుకున్నప్పటికీ ఆస్కూల్ నేపధ్యంలో వచ్చే నమ్రత పెద్దగా విజయ్ దేవరకొండలో కనిపించదు. దీనికితోడు ‘అర్జున్ రెడ్డి’ మూవీ తరువాత యూత్ కు విజయ్ ఐకాన్ స్టార్ గా మారిపోవడంతో యంగ్ హీరోలలో విజయ్ ను చాల డిఫరెంట్ గా ప్రేక్షకులు చూస్తున్నారు.


గత మూడు సంవత్సరాలుగా విజయ్ కు సరైన హిట్ లేకపోవడంతో పూరీజగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ మూవీ పై విజయ్ చాలఆశలు పెట్టుకున్నాడు. ఈమూవీకి సంబంధించిన టీజర్ కు విపరీతమైన స్పందన రావడంతో ఈమూవీతో హిట్ కొట్టి బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పరుచుకుని పాన్ ఇండియా హీరోగా మారాలని గట్టిప్రయత్నాలు చేస్తున్నాడు. ఈప్రయత్నాలకు తగ్గట్టుగా ఈమూవీ ప్రమోషన్ ను చాల డిఫరెంట్ గా కూడ చేస్తున్నారు.


ఈమధ్య ముంబాయ్ లో లోకల్ ట్రైన్ ఎక్కి విజయ్ అనన్యా పాండే లు తమకు తామే ట్రైన్ లో వారికి పరిచయం చేసుకుంటూ మధ్యలో అలిసిపోయిన విజయ్ అనన్యా పాండే ఒడిలో సేదతీర్చుకున్నట్లుగా వస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈపబ్లిసిటీ మరీ అతిగా ఉంది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. దీనికితోడు ఈమూవీలోని విజయ్ పాత్ర ఒక ఛాయ్ వాలా బాక్సర్ గా మారిన నేపధ్యం అతడి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే విజయ్ ఈమూవీలో మరీ అతి చేస్తున్నాడా అన్న విమర్శలు కూడ వస్తున్నాయి.


ఇది ఇలా ఉండగా ఈమధ్య విజయ్ ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో వారసత్వ హీరోల పై చేసిన విమర్శలు విజయ్ కెరియర్ కు నెగిటివ్ ప్రభావం చూపించే ఆస్కారం ఉంది అన్నకామెంట్స్ కూడ వస్తున్నాయి. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో వారసత్వ హీరోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ వీరాభిమానులు విజయ్ కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని ‘లైగర్’ విడుదల అయిన తరువాత నెగిటివ్ ప్రచారం చేసే విజయ్ కామెంట్స్ కు తమదైన తీరులో సమాధానం ఇచ్చే ఆస్కారం ఉంది కాబట్టి విజయ్ తన ఇగోను బయటపడకుండా మేనేజ్ చేసుకుంటే మంచిది అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: