సినిమా థియేటర్ కు గతంలో ప్రేక్షకులు ఎక్కువ సైతం సినిమా చూడడానికి వెళ్లేవారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం సినిమా థియేటర్లకు వెళ్లాలంటే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రేక్షకులు. ఎందుచేత అంటే ముఖ్యంగా సినిమా థియేటర్లోకి ఒక కుటుంబం వెళ్లాలి అంటే దాదాపుగా రూ.1000 రూపాయల పైన ఖర్చు వస్తుంది. ఇక అంతే కాకుండా దీనితోపాటు థియేటర్ లోపల స్నాక్స్ కూడా అదనంగా రూ.500 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల అయితే టికెట్ తో సమానంగా స్నాక్స్ ధరలు ఉండడం గమనార్హం. ఇక అదేవిధంగా బైక్ పార్కింగ్ ధరలు కూడా అధిక మొత్తంలోనే వసూలు చేస్తున్నారు.


దీంతో కుటుంబంతో కలిసి థియేటర్కు వెళ్లాలి అంటే దాదాపుగా రూ. 2000 రూపాయలు జోబిలో పెట్టుకొని వెళ్లాల్సిందే.. దీంతో అంత ఖర్చు అవసరమాని.. ప్రేక్షకులు థియేటర్కు వెళ్లడానికి మక్కువ చూపలేదు. ఇక అంతే కాకుండా ఒక నెలరోజుల వ్యవధిలోని పలు ఓటిటి సంస్థలలో కొత్త సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. దీంతో తెలుగు సినీ పరిశ్రమ చాలా కుదేలైంది అని చెప్పవచ్చు. రేట్లు పెంచేసి లాభపరదామనుకొని నిర్మాతలు అనుకోగా కానీ ఆ విషయం బెడిసి కొట్టిందని చెప్పవచ్చు. దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగపోయింది ఆదాయం సరిగ్గా లేకపోవడంతో నిర్మాతలు సైతం షూటింగ్లను బంద్ చేశారు.

అయితే సినిమా టికెట్ల రేట్లు అధికంగా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లకు రాలేదని కేవలం ఓటీటి లోనే సినిమాలు చూస్తున్నారని నిర్మాతలు తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ టికెట్ల రేట్ల కంటే స్నాక్స్ రేట్లు ఎక్కువ ఖర్చవుతుందని విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ సినిమా టికెట్ల రేట్లు దోపిడీ చాలా పెరిగిపోతూ వస్తోంది. ఇక ఎవరైనా బడా హీరోల సినిమా విడుదలైందంటే చాలు అధిక మొత్తంలో దోచేస్తూ ఉంటారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల వాటర్ బాటిల్ ధర రూ. 60 రూపాయలు, పాప్ కార్న్ రూ. 350 రూపాయలు, సమోసాలురూ. 200 పార్కింగ్ రూ.20 రూపాయలు, కూల్ డ్రింక్ రూ. 200 రూపాయలు ఉన్నాయి ఇలా అయితే సామాన్యులు ఎలా వెళ్తారని వాపోతున్నారు ప్రేక్షకుల.

మరింత సమాచారం తెలుసుకోండి: