టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల  లలో  ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను. అయితే ఈయన సినిమాలు తీసే విధానం, అందులో చూపించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.ఇకపోతే బోయపాటి అంటేనే యాక్షన్ ఎంటర్టైనర్ అని ప్రేక్షకులు ఒక అవగాహనకు వచ్చేసారు. ఇక అంతలా ఈయన తన సినిమాల్లో యాక్షన్ ను రుచి చూపిస్తూ ఉంటాడు..ఇకపోతే ఒక్కో సినిమా యాక్షన్ మరీ ఎక్కువ అయ్యి ప్లాప్స్ ఎదురైనా ఈయనకు మాగ్జిమమ్ హిట్ లే వచ్చాయి.ఇదిలావుంటే. ఇటీవలే బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా చేసిన విషయం తెలిసిందే.

ఇక  అఖండ సినిమాతో ఘన విజయం అందుకుని మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. కాగా ఈ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో సినిమా ప్రకటించాడు..అయితే ఇటీవలే రామ్ లింగుస్వామి దర్శకత్వంలో చేసిన 'ది వారియర్' సినిమా హిట్ అయ్యి పర్వాలేదు అనిపించింది. ఇక మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టు కుంది. పోతే  రామ్ ఈ సినిమా తర్వాత త్వరలోనే బోయపాటితో షూట్ లో పాల్గొనబోతున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.ఇకపోతే రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది.

కాగా ఈ స్క్రిప్ట్ ను బోయపాటి ఇటీవలే పూర్తి చేసి లాక్ చేశారట.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రాబరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందట.. ఇక.అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమాను బోయపాటి తన మార్క్ తో తీర్చిదిద్ద బోతున్నాడని వార్తలు వస్తున్నాయి..అంతేకాదు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది..అయితే  మరి ఈ సినిమా బోయపాటి, రామ్ కెరీర్ లకు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: