టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు .  ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే .

ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి .  ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరి కొత్త లుక్ లోకి మారడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఇది వరకే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో , ఎన్నో డిఫరెంట్ గెటప్ లలో కనిపించి తన ఫ్యాన్స్ తో పాటు ఇతర ఆడియన్స్ ను కూడా ఆశ్చర్యపరిచిన విషయం మనకు తెలిసిందే .  ఇది ఇలా ఉంటే ఈ సారి కొరటాల శివ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 30 కిలోల బరువు తగ్గి అదిరి పోయే స్లిమ్ లుక్ లోకి మరాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

అలాగే ఎన్టీఆర్ బరువు తగ్గడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండడం తో , ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టబోతున్నట్లు తెలుస్తోంది .  ఇది వరకే జూనియర్ ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్క బోయే తదుపరి సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: