గ్లామరస్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన సమంత ప్రస్తుతం కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ప్రస్తుతం సమంత కమర్షియల్ మూవీ లలో నటించడం కంటే కూడా , తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న మూవీ లలో నటించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే సమంత ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. సమంత తాజాగా కూడా యశోద అనే ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి అనే మూవీ లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేయగా , ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సమంత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. నెగటివ్ షేడ్స్ ఉన్న సమంత చివరకు పూర్తి పాజిటివ్ క్యారెక్టర్ గా ఎలా మారింది ... అనే కోణంలో  సమంత పాత్ర ఈ మూవీ లో సాగుతుందట. ఖుషి మూవీ ని 23 డిసెంబర్ 2022 వ తేదీన విడుదల చేయనున్నారు. విజయ్ దేవరకొండ , సమంత కాంబినేషన్ లో ఇది వరకు మహానటి సినిమా తెరకెక్కింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: