దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా ప్రేమ కథల స్పెషలిస్ట్ హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే ప్రేమ కథ చిత్రం తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినా రష్మిక మందన కీలక పాత్రలో నటించగా , తరుణ్ భాస్కర్ , సుమంత్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , భూమిక చావ్లామూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. 

మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ను మూవీ యూనిట్ విడుదల చేయగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సీతా రామం మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను అనౌన్స్ చేసింది.

ఈ రోజు అనగా ఆగస్ట్ 3 వ తేదీన సీతా రామం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరగనున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సీతా రామం సినిమా యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కింది. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమా బ్యానర్ లపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: