ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా చాలా బాగా నడుస్తోంది.ఒక సినిమాను పలు భాషల్లో కూడా రీలీజ్ చేసి ట్రెండ్ క్యాచ్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఇదే బాటలో ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్రాంత్ రోణ మూవీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబడుతూ సూపర్ హిట్ గా నిలిచింది.ఇక కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ఈ సినిమాను అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 28 వ తేదీన విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల్లో కూడా చెప్పుకోదగిన మంచి వసూళ్లు రాబడుతోంది. అలాగే వరుసగా నాలుగో రోజు కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది.అలాగే విడుదలకు ముందు నుంచే ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా మొత్తం 1.25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అయితే సినిమా విడుదల తర్వాత ఆ మార్క్ చాలా అలవోకగా దాటేశాడు విక్రాంత్ రోణ సుదీప్.అలాగే నాలుగో రోజుకు గాను రెండు రాష్ట్రాల్లో కలిపి  మొత్తం 1.01 కోట్లు షేర్‌ ఇంకా 2.05 కోట్లు గ్రాస్ వచ్చినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.


మొత్తంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో కలిపి 2.92 కోట్ల షేర్ ఇంకా 5.80 కోట్లు గ్రాస్ వసూలైంది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఈజీగా ఫినిష్ చేసి లాభాల బాటలో ఉంది ఈ సినిమా.ఆదివారం నాడు సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగిన కలెక్షన్లు వచ్చాయి. తెలుగు స్టార్ హీరోల సినిమాలైన రామారావు ఆన్ డ్యూటీ, థ్యాంక్యూ ఇంకా ది వారియర్ సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ భారీగా వసూళ్లు రాబట్టాడు విక్రాంత్ రోణ.ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా కూడా కేవలం ఈ నాలుగు రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ ఇంకా 50 కోట్లకు పైగా షేర్ వసూలైనట్లు తెలుస్తోంది.విడుదలకు ముందు ఈ సినిమాపై ఉన్న అంచనాలతో మొత్తం 75 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఇక విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా సగం కంటే ఎక్కువ టార్గెట్ పూర్తి చేయడంతో ఈ మూవీ సూపర్ హిట్ ట్రాక్ లోకి వెళ్ళినట్లే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: