టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి కమ్ బ్యాక్ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది హీరోయిన్ సమంత. ఇప్పటికే వచ్చిన ప్రతి ఒక్క అవకాశం కూడా వినియోగించుకుంటూ తిరిగి స్ట్రాంగ్ అయ్యే విధంగా సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే పుష్ప సినిమా లో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ విధంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు ఒక పెద్ద హీరో సరసన హీరోయిన్ గా నటిస్తూ మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆ విధంగా ఇప్పుడు ఆమెకు తెలుగులో మరొక భారీ అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది.

సుకుమార్ పుష్ప 2 సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో ఐటెం భామ గా ఆమెను చేయించిన సుకుమార్ రెండవ భాగంలో ఆమె కోసం ఒక స్పెషల్ పాత్రను క్రియేట్ చేశాడట. మరి ఆ లింకును ఏ విధంగా ఈ సినిమాలో కలుపుతాడు అనేది చూడాలి. ఇంటెలిజెంట్ సినిమాలకు పెట్టింది పేరుగా ఉన్న సుకుమార్ ఈ ముద్దుగుమ్మ పాత్ర ను రెండవ భాగంలోకి లింక్ చేయడం పెద్ద విషయమేమీ కాదు.  చాలా రోజుల నుంచి ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ ను తీర్చిదిద్దుతున్న సుకుమార్ త్వరలోనే దీని యొక్క షూటింగ్ కు రంగం సిద్ధం చేస్తున్నాడు.

ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడని అంటున్నారు. దీనికోసం ఇతర దర్శక,రచయితలను కూడా వాడాడట.అలా ఇప్పుడు ఈ సినిమాలోని మిగతా పాత్రల యొక్క నటీనటుల ఎంపిక జరుగుతుందని తెలుస్తుంది. పుష్ప 1 లో లేని చాలామంది ఈ రెండో భాగం లో కనిపిస్తారట. ఈ నేపథ్యంలో ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అవుతుందని చెబుతున్నారు. మరి అప్పుడు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: