మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన వరుస సినిమాలు బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతున్నాయి. ఆయన నటించిన సినిమా ఖిలాడి ఈ ఏడాది మొదట్లో విడుదలయి డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఇప్పుడు చేయబోయే రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై ఆయన అభిమానులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు. కానీ రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టుకోలేకపోయినా ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.

మరి ఆ తర్వాత సినిమాలతోనైనా ఆయన విజయాన్ని అందుకొని మళ్ళీ కం బ్యాక్ చేస్తాడా అనేది చూడాలి. వాస్తవానికి రవితేజ ఒప్పుకోవడమే అరడజన్ సినిమాల దాకా ఒప్పుకొని చకచకా సినిమాలు పూర్తి చేస్తున్నాడు. కేవలం పారితోషకం కోసమే ఆయన ఇన్ని సినిమాలను ఒప్పుకున్నట్లు ఉంది. వీటిలో కొన్ని సినిమాలకైతే దర్శకుడు ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియదు. కొత్తవారితో సినిమాలు చేయడం రవితేజకు ఎంతో ఇష్టమే అయినా కూడా కాస్త చూసి దర్శకుడు గురించి తెలుసుకొని సినిమాలు చేస్తే మంచిదని వారు చెబుతున్నారు.

అలా ఇంకో రెండు మూడు ఫ్లాప్ లు కనక పడితే రవితేజ పరిస్థితి అయోమయంలోకి వెళ్లడం ఖాయం అని అంటున్నారు. మొదటి నుంచి కూడా రవితేజ ప్లాప్ దర్శకులకు కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వారిని సక్సెస్ చేస్తూ తాను కూడా సక్సెస్ అయ్యేవాడు అలా ఇప్పుడు రామారావు సినిమా తర్వాత చేస్తున్న సినిమాలు అన్నీ కూడా ఓ మోస్తరు దర్శకులు కావడం విశేషం. అయితే రవితేజ ఎంతో నమ్మకం పెట్టుకొని వారికి అవకాశాలు ఇస్తుంటే వారు నిలబెట్టుకోకపోవడం నిజంగా రవితేజను ఇటు ప్రేక్షకులను అటు అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. మరి రవితేజ కూడా పెద్ద దర్శకులతో ఒక సినిమా చేసి ఆ తరువాత ఇలాంటి ప్రయోగాలు చేస్తే మంచిది. రవితేజ ఇప్పటికైనా ఆలోచించి సినిమాలు చేస్తాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: