ఇప్పుడు సమంత గురించి కానీ నాగచైతన్య గురించి కానీ ఎలాంటి వార్త వచ్చినా అది వెంటనే వైరల్ అయిపోతోంది.అయితే తాజాగా తన లవ్ లైఫ్ గురించి నాగచైతన్య చేసిన కొన్ని కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.ఇక  'ఏమాయ చేశావే' సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని నాగ చైతన్య, సమంత తొలిసారి తారసపడ్డారు. అయితే ఇక  అప్పుడు మొదలైన పరిచయం చివరికి ప్రేమకు దారి తీసింది. పోతే చాలా ఏళ్లు ప్రేమించుకున్న చై-సామ్ పెద్దలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఏమైందో తెలియదు కానీ క్యూట్ కపుల్ అనిపించుకున్న వీరు గతేడాది విడాకులు తీసుకున్నారు. ఈ ఇద్దరు ఏ కారణంతో విడిపోయారనే అంశం మీద ఇప్పటికి రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. 

ఇదిలావుంటే తరువాత టాలీవుడ్‌ హీరోయిన్‌, తెలుగమ్మాయి శోభిత ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్‌ చేస్తున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. ఇక ఈ విషయం మీద ఇద్దరూ ఇప్పటిదాకా స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఇక నిజానికి శోభిత ధూళిపాళ ఖండించింది అన్నారు కానీ అధికారికం అయితే కాదు.ఇకపోతే  అసలు విషయం ఏమిటంటే థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు.ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కానున్న క్రమంలో సినిమా నటీనటులు అందరూ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఇకపోతే RJ సిద్ధార్థ్ కన్నన్‌తో ఒక ఇంటరాక్షన్ సందర్భంగా,

 నాగ చైతన్య శోభితా ధూళిపాళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు వచ్చిన వార్తలపై కు స్పందించారు.కాగా  శోభితతో మీ రిలేషన్ షిప్ స్టేటస్ గురించి చెప్పమని అడిగినప్పుడు, నాగ చైతన్య సిగ్గుపడుతూ దానికి నేను నవ్వడం తప్ప ఏమీ చెప్పలేనని పేర్కొన్నాడట.అయితే ఆయన మరొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మా విషయంలో, సమంత ఇప్పటికే మూవ్ ఆన్ అయింది, నేను కూడా మూవ్ ఆన్ అయ్యాను.ఇక  ఇప్పుడు మా రిలేషన్ గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం నాకు లేద''ని అన్నారు. అయితే  ఇక సమంత మాత్రం కాఫీ విత్ కరణ్ షోలో అందుకు భిన్నంగా స్పందించింది. కాగా మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ లేదు కాబట్టి ఇద్దరినీ ఒక రూంలో ఉంచాల్సి వస్తే పదునైన వస్తువులు లేకుండా చూసుకోవాలని పేర్కొంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: