పాన్ ఇండియా సినిమా చేయగానే సరిపోదు. హీరోలు అందరూ కూడా ఆ సినిమా చేసిన తర్వాత తాము ఎలాంటి సినిమాలను చేయాలి అనే ప్రణాళిక చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఆ విధంగా ఇప్పుడు చాలామంది హీరోలు పాన్ ఇండియా మాయలో పడి చేతులు కాల్చుకుంటున్నారు. మొట్టమొదటగా ఇలాంటి చిత్రాలు చేయడం ఆరంభించిన ప్రభాస్ ను సైతం పాన్ ఇండియా సినిమాల విషయంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

బాహుబలి సినిమాతో ఆయన పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ముందుకు రాగా అది విపరీతంగా ప్రేక్షకులను అలరించిన మాట పక్కన పెడితే ఏమాత్రం కూడా ఆ తదుపరి సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకులను అలరించలేకపోయాడు అన్నది వాస్తవం. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు ప్రభాస్. ఆ విధంగా కే జి ఎఫ్ స్టార్ పై కూడా ఇప్పుడు ఎంతో ఒత్తిడి నెలకొంది. అంతటి స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ హీరో తన తదుపరి సినిమాను కూడా అంతటి స్థాయిలో కాకపోయినా కూడా అంతకు మించిన స్థాయిలో ఉండేలా చూసుకోవాలని చూస్తున్నాడు.

నిజంగా ఆయన అభిమానులను ఎంతగానో కలవర పెట్టిస్తుంది. నర్తన్ అనే ఓ దర్శకుడు తో కలిసి తన తదుపరి సినిమా చేస్తున్న ఈ హీరో మరి కేజీఎఫ్ స్థాయిలో ఆ సినిమాను చేసి విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి. మరి  ఇప్పటికే ఇబ్బందులు ఫేస్ చేస్తున్న ప్రభాస్ ను చూసి ఫ్యాన్ ఇండియా హీరోల గుండెలలో గుగులు పుట్టిస్తుందని కూడా చెప్పవచ్చు. ప్రభాస్ పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధమైన ప్రయత్నాలు చేయబోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాల ద్వారా భారీ ఫ్లాప్ లను ఎంచుకున్నాడు. మరి రాబోయే చిత్రాలతో ఆయన విజయాలు అందుకొని పాన్ ఇండియా స్టార్ గా నిలబడతాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: