ఇక ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చెప్పకుండానే నిశ్చితార్ధాలు ఇంకా అలాగే పెళ్లిలు చేసుకునేస్తున్నారు. కానీ డివర్స్ ని మాత్రం చెప్పి తీసుకుంటున్నారు. ఇది వారి ప్రైవసీ భంగం కలుగుతుందనో..లేక, మరేదైన రీజనో తెలియదు కానీ..స్టార్ సెలబ్రిటీలు అంతా కూడా ఇక ఇలానే చేస్తున్నారు.కానీ వాళ్లకి సంబంధించిన వార్తలు అన్ని కూడా మీడియాలో ముందే వినిపిస్తున్నాయి. అయితే ఇక ఈ బుల్లితెర జంట మాత్రం ఎక్కడ అసలు బయట పడకుండా ఇంకా అలాగే తమ ప్రేమ విషయం బయటకి రానివ్వకుండా చాలా సైలెంట్ గా నిశ్చితార్ధం చేసుకునేసారు.బుల్లితెర పై సీరియల్స్ చూసేవాళ్లకి అమర్‌దీప్‌ పేరు గురించి అసలు పెద్ద గా పరిచయం చేయాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో ఇంకా అలాగే చలాకీ తనంతో చిలిపి అలరితో..అందరిని నవ్విస్తూ ఇంకా అలాగే ఎప్పుడు తాను నవ్వుతూ కూడా ఉంటాడు.. మంచి అందం, హైట్ ఇంకా చాలా సరదాగా మాట్లాడుతూ అందరిని కలుపుకునిపోయే అమర్ ప్రజెంట్ జానకి కలగనలేదు అనే సీరియల్ లో నటిస్తున్నారు.ఇక ఈయన కన్నడ పరిశ్రమకు చెందిన తేజస్విని ని పెళ్లి చేసుకోబోతున్నాడు.


ఆమె కూడా మనకు తెలిసిన బాగా సుపరిచితురాలే. ఒకప్పుడు కోయిలమ్మ సీరియల్ లో చిన్ని పాత్రతో అందరికి దగ్గరైన ఈ అమ్మడు ఇక ఇప్పుడు కూడా సీరియల్స్ లో నటిస్తుంది.ప్రస్తుతం తేజస్వి కేరాఫ్‌ అనసూయ సీరియల్‌ చేస్తోంది.అయితే ఇక వీళ్లు ప్రేమించుకున్నట్లు..ఎక్కడ బయటపడకుండా చాలా సీక్రేట్ గా ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అయిపోయారు. తాజాగా వారు నిశ్చితార్ధం కూడా చేసుకునేశారు. వీళ్ల పిక్స్ ని బిగ్ బాస్ హాట్ బ్యూటీ అయిన అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవరకు ఈ విషయం అస్సలు ఎవ్వరికి కూడా తెలియదు. దీంతో వీళ్ల నిశ్చితార్ధానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: