మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో వైఫ్ సినిమాల పైన పడడంతో మరింత స్పీడ్ పెంచారు చిరంజీవి. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మెగాస్టార్ ఇప్పుడు మరొక డైరెక్టర్ కు అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది అని ఫిలిం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే చిరంజీవి పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అది కూడా కొత్త సినిమా కాదు అప్పట్లో చిరంజీవితో అనుకొని ఆగిపోయిన సినిమానే అన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఆ చిత్రం ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎందుకు మొదలవుతోంది అనే ప్రశ్న చిరంజీవి అభిమానులలో తలెత్తుతున్నాయి.


పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమా ప్రమోషన్ల లో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతోంది. అయితే తాజాగా చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ ను కూడా కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటో చూసిన తర్వాత చిరంజీవి పూరి జగన్నాథ్ కాంబినేషన్ మిస్సయిన ఆటో జానీ సినిమా మళ్లీ తెరకెక్కిస్తారేమో అనే విధంగా మెగా అభిమానులలో కొత్త ఆశలు నెలకొంటున్నాయి. పూరి జగన్నాథ్ అంటే చిరంజీవికి ముందు నుంచి నమ్మకం ఉండడంతో.. తన కొడుకు రామ్ చరణ్ బాధ్యత కూడా అతడికి అప్పగించారు అప్పట్లో.

అని అనుకున్నట్టు జరిగితే.. ఖైదీ నెంబర్ 150 స్థానంలో పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబినేషన్లో ప్రాజెక్ట్ మొదలయ్యేది కానీ ఇద్దరి మధ్య రిలేషన్ చెడిపోయింది అనే వార్తలు కూడా అప్పట్లో బాగా వినిపించాయి. అయితే ఈ మధ్య పరిస్థితులు మారుతూ ఉన్నాయి.. చూస్తుంటే చిరంజీవి పూరి జగన్నాథ్ కాంబినేషన్ మళ్ళీ సెట్ అవ్వబోతోంది అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈమధ్య రెగ్యులర్గా చిరంజీవి పూరి జగన్నాథ్ బాగా కలిసి ఉండడంతో తాజాగా ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: