బుల్లితెర సూపర్ హిట్ ప్రొగ్రామ్ జబర్దస్త్‌ తెలియని వారుండరు.అయితే  యాంకర్ అనసూయ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక దీంతో ఆమె స్థానంలో కొత్త యాంకర్‌ను తీసుకొచ్చేందుకు మల్లెమాల యాజమాన్యం సిద్ధమైంది.ఇకపోతే పాత యాంకర్ అనసూయతో పోలిస్తే ఆమెను తక్కువ చేసి చూస్తున్నారని ప్రస్తుతం నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది.అయితే  ఒకప్పుడు బుల్లితెర అంటేనే జబర్దస్త్ అనేలా ఆ షోను కమెడియన్స్ సుధీర్ అండ్ గ్యాంగ్ మార్చేశారు.ఇక  దీనికి తోడు జడ్జెస్ నాగబాబు, రోజాతో పాటు యాంకర్ రేష్మీ, అనసూయ తమ అందాల విందులతో దానికి ఎన్నడూ లేనంతగా రేటింగ్స్ తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఇక ఏం జరిగిందో తెలీదు ఒక్కొక్కరుగా జబర్దస్త్‌ను వీడుతున్నారు.ఇకపోతే  ముందుగా నాగబాబు, ఆ తర్వాత రోజా ఇలా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు.ఇక  ఆ తర్వాత సుధీర్ అండ్ గ్యాంగ్ తో పాటు మరికొందరు సీనియర్ కమెడియన్స్ కూడా జబర్దస్త్ను వీడారు. కాగా తన అందాలతో ఆడియెన్స్ మతి పొగొట్టిన అనసూయ కూడా జబర్దస్త్‌ను వీడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇక  ఆమె స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన యాంకర్‌కు అనసూయతో పోలిస్తే ట్రీట్మెంట్ సరిగా లేదని టాక్ వినిపిస్తోంది.ఇదిలా వుండగా ఇప్పటివరకు కొత్త యాంకర్ ఫేస్ రివీల్ చేయకపోయినా మంజుషాను తీసుకుని రాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అయితే, ఇక  అనసూయకు గతంలో రూ.5లక్షలు పాకేజీ ఇచ్చిన మల్లేమాల యాజమాన్యం మంజుషాకు కేవలం రూ.2లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే ఇస్తున్నట్టు వినికిడి.అయితే  ఇది నిజంగానే మంజుషాకు అవమానం అని బుల్లితెర వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఇకపోతే  ఆడియెన్స్ పల్స్‌ను కొత్త యాంకర్ పట్టుకుంటే ఆమెకు రెమ్యూనరేషన్ పెంచుతామని ఈటీవీ యాజమాన్యం చెప్పినట్టు తెలుస్తోంది.కాగా  అనసూయ లాగా తన అందాల విందుతో పాటు మాటకారి తనంతో ఆడియెన్స్‌ను కొత్త యాంకర్ మెప్పిస్తుందా లేదా అనేది వేచిచూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: