‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ ఫెయిల్ కావడంతో రవితేజా అభిమానులు మరింత నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. ఈమూవీ టాక్ ఎలా ఉన్నప్పటికీ కనీసం ఈ మూవీకి ఓపెనింగ్ కలక్షన్స్ కూడ సరిగ్గా రాకపోవడంతో మాస్ మహారాజ పవర్ పూర్తిగా తగ్గిపోయిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రవితేజా కెరియర్ ను విశ్లేషణ చేస్తే ఒక్క హిట్ వస్తే ఆతరువాత వరసగా కనీసం 5 ఫ్లాప్ లు ఎదురౌతున్నాయి.


ఆమధ్య ‘రాజా ది గ్రేట్ తరువాత మళ్ళీ రవితేజాకు హిట్ రావడానికి ‘క్రాక్’ సినిమా వరకు ఆగవలసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మాస్ మహారా కు వరస ఫ్లాప్ లు ఎదురౌతున్నాయి. ఇలాంటి పరిస్థితి అతడికి ఏర్పడటానికి అతడు దర్శకుల ఎంపిక విషయంలో చేస్తున్న పొరపాట్లు అన్న కామెంట్స్ అతడి అభిమానుల నుండి వస్తున్నాయి.


రవితేజా నటిస్తున్న ప్రస్తుత సినిమాల లైనప్ ఒక్కసారి పరిశీలిస్తే ఒక ఆసక్తికర విషయం అభిమానుల దృష్టిలోకి వస్తోంది. మాస్ మహారాజా ప్రస్తుతం నటిస్తున్న ‘ధమాకా’ మూవీని నక్కిన శ్రీనాధరావు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆతరువాత విడుదలయ్యే ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీకి దర్శకుడు వంశీ ‘రావణాసుర’ మూవీకి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.


అయితే ప్రస్తుతం ఈ దర్శకులు ఎవ్వరు హిట్ ట్రాక్ లో లేరు. ఇది చాలదు అన్నట్లుగా హిట్ ట్రాక్ లో లేని శ్రీవాసు దర్శకత్వంలో మరో మూవీని చేయడానికి రవితేజా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మాస్ మహారాజా కు ఇలా వరసపెట్టి ఫెయిల్యూర్ దర్శకులు ఎందుకు దొరుకుతున్నారు అంటూ అతడి అభిమానులు కలవర పడుతున్నారు. ఇలా ఫెయిల్యూర్ దర్శకులతో సినిమాలు చేసే కంటే తమ హీరో టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ వివేక్ ఆత్రేయ తరుణ్ భాస్కర్ అనుదీప్ లాంటి యంగ్ డైరెక్టర్స్ కు తమ హీరో ఎందుకు అవకాశాలు ఇవ్వరు అంటూ మాస్ మహారాజ అభిమానులు మధన పడుతున్నట్లు టాక్..
మరింత సమాచారం తెలుసుకోండి: