దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాలిని ఠాగూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం సినిమా రేపు అనగా ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ లపై అశ్వనీదత్ నిర్మించారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. అలా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకోవడం ద్వారా ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ఓవర్ సీస్ లో అదిరిపోయే రేంజ్  ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్నట్లు తెలుస్తోంది.  

మూవీ ఓవర్ సీస్ మార్కెట్ లో 7 లక్షల డాలర్స్ వరకు టార్గెట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. మరి సినిమా ఓవర్ సీస్ లో ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా ,  భూమిక చావ్లా , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , సుమంత్ , తరుణ్ భాస్కర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సీతా రామం సినిమా యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: