టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా , బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేమూవీ లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ ని దర్శకుడు పూరి జగన్నాథ్ బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కించాడు. ఈ మూవీ లో మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటించగా , విజయ్ దేవరకొండ కు తల్లిగా ఈ మూవీ లో రమ్యకృష్ణ నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను టీజర్ ,  ట్రైలర్ ని విడుదల చేయగా మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు , టీజర్ , ట్రైలర్ కు ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని ఆగస్ట్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తో పాటు హిందీ , తమిళం , మలయాళం , కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని పూరి కనెక్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి జగన్నాథ్ , కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ నుండి 'ఆఫట్' అనే పల్లవి తో సాగె మెలోడియస్ పాట ప్రోమో ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు, అలానే ఫుల్ సాంగ్ ని రేపు అనగా ఆగస్ట్ 5 వ తేదీన ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ కొద్ది సేపటి క్రితం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: