రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయిందనీ చెప్పాలి. కారణం ఏదైనా కూడా వరుసగా రవితేజ హీరోగా నటించిన రెండో సినిమా దారుణంగా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. భారీ డిజాస్టర్ గా మారిన ఈ సినిమా ద్వారా నిర్మాతలకి కోట్ల కొద్ది నష్టం వచ్చిందన్న మాట వాస్తవం. దాంతో ఏ విధంగా ఈ చిత్రం యొక్క నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లు గెట్ బ్యాక్ అవుతారో అన్న సందిగ్ధత అందరిలో నెలకొంది.

దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా మలచలేకపోవడమే సినిమా ఇంత దారుణంగా ఫ్లాప్ అవడానికి కారణం అని చెప్పాలి. మాస్ ను అలరించడం లో కూడా ఎంతో తేలిపోయిన ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. అందుకే ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేక డిజాస్టర్ గా మిగిలింది. అందుకే నష్టపోయిన నిర్మాతలకు హీరో రవితేజ కొంత డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేసినట్లుగా కొందరు చెబుతున్నారు. అయితే అసలు వాస్తవం అది కాదట. ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఒక ఫేక్ వార్త అని చెబుతున్నారు.

వాస్తవానికి ఇదే నిర్మాతకు మరొక సినిమా చేసే ఆలోచనలో రవితేజ ఉన్నాడట. ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని ఆఖరుగా చేయబోతున్నాడు. ఆ తరువాత మళ్లీ ఇదే నిర్మాతలతో ఆయన సినిమా ఓకే చేస్తాడా అనేది చూడాలి. ఇకపోతే త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కొన్ని రోజులలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రమైన రవితేజ హిట్ అందిస్తుందా అనేది చూడాలి. ఇక సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేస్తున్న రావణాసుర సినిమాపై కూడా ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. వరుస సినిమాలు తెరకెక్కిస్తున్న కూడా రవితేజకు అవి ఏమాత్రం సక్సెస్ ను తెచ్చి పెట్టకపోవడం నిజంగా ఆయన అభిమానులను కలచి వేస్తుందని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: