రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందగా ఛార్మీ మరియు కరణ్ జోహార్ లు ఈ చిత్రం ను భారీ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క ప్రచార చిత్రాలు ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించాయి. దాంతో ఒక్కసారిగా అంచనాలు భారీ గా పెరిగిపోయాయి అని చెప్పాలి.

విడుదల తేదీ దగ్గర పడడం తో  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. త్వరలోనే హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి సిద్ధమయ్యింది. గతంలో చిత్ర నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ పలు ఈవెంట్స్ ను అక్కడ డిజైన్ చేసింది. మంచి సంస్థలు కూడా రాబట్టుకుంది.  ఈ విధంగా విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 

ఆ విధంగా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక పాటను ముందుకు తీసుకురాబోతున్నారు. ఈరోజు ఈ పాటకు సంబంధించిన ప్రోమోను సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేస్తూ ఉండగా పూర్తి పాటను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఆ విధంగా వరుస అప్డేట్లతో సినిమాపై అంచనాలను రోజురోజుకు పెంచుతున్న చిత్ర బృందం ఎన్నో స్పెషాలిటీస్ ని యాడ్ చేసి ఈ సినిమాను చేయడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా ఈ చిత్రం భారీ వసూలను అందుకోవడం ఖాయం అని చెబుతున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా న లటించిన ఈ సినిమా తప్పకుండా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా వేరే స్థాయిలో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: